మంత్రి తొలి సంతకం..
రాయికల్: మండలంలోని జగన్నాథపూర్– బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు చేస్తూ 2025 జూన్ 21న గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తొలి సంతకం చేశారు. రెండుసార్లు టెండర్లు అయినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో బ్రిడ్జి పనులకు మోక్షం కలగడం లేదు. దీంతో గిరిజనులు రాకపోకలకు ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్నాథపూర్ గ్రామం రాయికల్ మండలంలో ఉన్నా.. అక్కడికి మల్లాపూర్ మండలం వీవీరావుపేట నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్నాథపూర్– బోర్నపల్లి మధ్య వాగు ఉండడంతో హైలెవల్ వంతెన కోసం దశాబ్దాలుగా సర్వేలు చేసినా మోక్షం కలగడం లేదు.
తగ్గనున్న దూరభారం
జగన్నాథపూర్ గ్రామానికి వెళ్లాలన్నా, అక్క డి గిరిజనులు రాయికల్‌కు రావాలన్నా సుమారు 15 కి.మీ రావాల్సిందే. మల్లాపూర్ మండలం వీవీ రావుపేట నుంచి రాయికల్ మండలం కొత్తపేట, మూటపల్లి, రామాజీపేట మీదుగా రాయికల్ చేరుకుంటారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే జగన్నాథపూర్ నుంచి కేవలం అరకిలో మీటరు దూరంలో ఉన్న బోర్నపల్లికి 20 నిమిషాల్లో చేరుకొని, అక్కడి నుంచి బస్సు, ఆటోల ద్వారా రాయికల్, బోర్నపల్లి నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న నిర్మల్ జిల్లా కడెంకు తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామ ప్రొఫైల్
జనాభా 840
ఓటర్లు 670
వార్డులు 8
దూర భారం తగ్గుతుంది
వంతెన నిర్మాణానికి మంత్రి నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాక పనులు ప్రారంభం కాదు. మా గిరిజనుల కల హైలెవల్ బ్రిడ్జి. ఈ నిర్మాణం పూర్తయితే దూరభారం తగ్గుతుంది.
– పరంచ శంకర్, సర్పంచ్, జగన్నాథపూర్


