జగిత్యాల: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనలో భాగంగా జిల్లాకు స్టేట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారి లోకేశ్‌కుమార్ రాగా, కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత ఘన స్వాగతం పలికారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాలి
జగిత్యాలరూరల్: విద్యుత్ శాఖ అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫార్మర్లను బిగించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీర్‌పూర్ మండలం మంగేళ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించడం లేదని రైతులు శుక్రవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవన్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. మంగేళ, కమ్మునూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గతంలోనే బిగిస్తామన్న అధికారులు ఎందుకు బిగించడం లేదని నిలదీశారు. చెరువుల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని, లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్‌ఫార్మర్లు బిగిస్తే రైతులకు సాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు.
పెన్షన్ మంజూరు చేయాలి
వితంతు మహిళలకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం తలుపులగూడెం గ్రామానికి చెందిన రైతు ఇటీవల మృతిచెందగా, శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. భర్తలను కోల్పోయిన మహిళలకు ఆంక్షలు లేకుండా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు. అనంతరం గ్రామంలో బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని అధికారులతో ఫోన్లో మాట్లాడి సూచించారు.
కాంగ్రెస్ పాలన అంతా అవినీతి
రాయికల్: కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయంగా మారిందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం అల్లీపూర్‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి చాయ్‌తో ఆత్మీయ పలుకరింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా హామీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయంగా ఉందని పేర్కొన్నారు. ఆమె వెంట తురగ శ్రీధర్‌రెడ్డి, బర్కం మల్లేశ్‌యాదవ్, అత్తినేని గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ మృతికి ట్రస్మా నివాళి
జగిత్యాలటౌన్: ప్రిన్సిపల్ రూపారెడ్డి మృతి బాధాకరమని ట్రస్మా జిల్లా ప్రతినిధి అన్నేడి మనోహర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల దాడిలో మృతి చెందిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతిపై ట్రస్మా ప్రతినిధులు శుక్రవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కార్యక్రమంలో ట్రస్మా ప్రతినిధులు ముసపట్ల రాజేందర్, రామారావు, సుధీర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులు, ఉపాధ్యాయుల సంతాపం
రాయికల్: నల్గొండలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతిపట్ల శుక్రవారం రాయికల్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించి సంతాపం పాటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రూపరెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలె శేఖర్, ఎద్దండి ముత్యంరాజు, కై రం సత్యం, వేణుగోపాల్‌రావు, మచ్చ గంగాధర్ పాల్గొన్నారు.


