సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

● తప్పులు దొర్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదు ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

జగిత్యాల: రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరి ష్కరించాలని, తప్పులు దొర్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇందిర మ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, భూ రీసర్వే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ప్రభుత్వం రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించిందని, చిన్న సమస్య కూడా లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ మొదటి దశలో ఎల్‌–3 సమస్యలను పరిష్కరించి అర్హులను ఎల్‌–1 జాబితాలోకి తీసుకువచ్చి ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ బిల్లులు త్వరలోనే చెల్లిస్తామన్నారు. 250 చదరపు అడుగుల స్లాబ్‌ విస్తీర్ణత పరిమితి పెట్టడం వల్ల నిజమైన పేదలకు ప్రయోజనం అందించడం జరుగుతుందన్నారు.

అవినీతికి తావు లేదు

రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతికి అవకాశం ఉండబోదని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో సర్వే చేసేందుకు రూ.లక్ష అడుగుతున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే రా యికల్‌ తహసీల్దార్‌కు మెమో జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ సస్పెండ్‌కు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement