కోతలే.. అమ్మకు తిప్పలే..! | - | Sakshi
Sakshi News home page

కోతలే.. అమ్మకు తిప్పలే..!

Aug 18 2026 12:39 AM | Updated on Aug 18 2026 12:39 AM

● ఆస్పత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్లు ● ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అత్యధికం..

ఆపరేషన్‌తో జన్మించిన శిశువుకు చురుకుదనం తక్కువ

ఆపరేషన్‌ కాన్పువల్ల సిరల్లో రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతాయి. దాని వల్ల తల్లికి హానికరం.

చనుబాలు ఇవ్వడం ఆలస్యమవుతుంది

గర్భాశయ గోడకు నష్టం వాటిల్లుతుంది

సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది

శస్త్ర చికిత్స మచ్చ ఎప్పటికీ ఉండటంతో పాటు ఇబ్బందే.

రోజువారి పని చేసుకోవడం కష్టం

మొదటి ఆపరేషన్‌ చేయించుకున్న వారు రెండో కాన్పు కూడా ఆపరేషన్‌ చేసుకోవాల్సిందే.

శిశువుకే చురుకుదనం ఎక్కువ

సిరల్లో రక్తం గడ్డకట్టదు

చనుబాలు త్వరగా ఇవ్వగలదు

గర్భశయ గోడకు నష్టం ఉండదు

రెండుమూడు రోజుల్లో ఇంటికి వెళ్లవచ్చు

ఎలాంటి మచ్చలు, ఇబ్బందులు ఉండవు

రోజువారి పనులు త్వరగా చేసుకోవచ్చు

ఎన్ని కాన్పులకై నా ఇబ్బందులు ఉండవు

మహిళలకు శస్త్రచికిత్సలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికంగా శస్త్రచికిత్సలే జరుగుతున్నాయి. జగిత్యాల ఆస్పత్రిలో జగిత్యాలతో పాటు ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ప్రసవం కోసం ఇక్కడకే వస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సాధారణ ప్రసవమయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ముందుగా గర్భిణుల్లో భయం తొలగించి సాధారణ కాన్పులు జరిగేలా సంసిద్ధులను చేయాల్సిన బాధ్యత వైద్యాధికారులదే. సాధారణ ప్రసవమైతే మూడునాలుగు రోజుల్లో ఇంటికి వెళ్లవచ్చు. అదే శస్త్రచికిత్స జరిగితే వారం నుంచి 10 రోజుల వరకు ఆస్పత్రిలోనే ఉండాల్సిందే. పైగా అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి.

పౌష్టికాహారం లేకనే..

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఐసీడీఎస్‌ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులను గుర్తించి వారికి మొదటి నుంచే పౌష్టికాహారం అందిస్తుంటారు. అయినప్పటికీ మహిళల్లో పౌష్టికాహారం లేక రక్తహీనత నెలకొని సీజేరియన్‌ వైపు వెళ్లాల్సి వస్తోంది. ఓవైపు ప్రభుత్వం రూ.కోట్లతో గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటం లేదు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతినెలా 102 వాహనంలో తీసుకువచ్చి చెకప్‌ చేయించుకుని మళ్లీ తిరిగి ఇంటి వద్ద దింపే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. అయినప్పటికీ గర్భిణులకు ఏదో ఒక విధంగా లోపాలు ఏర్పడుతూ శస్త్ర చికిత్సలకే దారి తీస్తున్నాయి.

శుభ ముహూర్తాల కోసం..

ప్రసవం కోసం వచ్చిన మహిళల తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తూ తమ కూతురు తట్టుకోలేదని సిజేరియన్‌ చేయాలంటుండడంతో చేసేదేమీలేక శస్త్రచికిత్సలే చేస్తున్నారు. కొందరు శుభ ముహూర్తాలు అంటూ సిజేరియన్‌ చేయిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన మహిళకు అన్నివిధాల పరీక్షలు నిర్వహించిన అనంతరం పురిటి నొప్పులు తట్టుకుంటుందా లేదా అని పర్యవేక్షిస్తుంటారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండానే సిజేరియన్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గర్భస్రావం అయ్యే మహిళలను హైరిస్క్‌గా గుర్తించి ప్రాథమిక స్థాయి నుంచి చికిత్స అందించాలి.

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల వివరాలు ఇలా..

ఏడాది సాధారణం సిజేరియన్‌ 2023-24 2,385 4,069

2024-25 2,337 4,237

2025-26 3,008 5,298

ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవాల వివరాలు

ఏడాది సాధారణం సిజేరియన్‌ 2023-24 1,087 6257 2024-25 1,009 5,947 2025-26 709 4,389

సిజేరియన్‌తో ఇబ్బందులు

సాధారణ కాన్పులో..

జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు తగ్గిస్తూ.. సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలీవరిలు 3,008 కాగా.. శస్త్రచికిత్సలు 5,298 అయ్యాయి. అదే ప్రైవేటు విషయానికొస్తే.. నార్మల్‌ కేవలం 709 కాగా.. శస్త్రచికిత్సలు 4,389కి పెరిగాయి. ఇటీవల కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సీసెక్షన్లు తగ్గించాలని వైద్యులను ఆదేశించారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి సిజేరియన్లు కాకుండా నార్మల్‌ డెలివరికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement