జగిత్యాల: ఉద్యోగుల ప్రధాన సమస్య అయిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో టీఎన్జీవో కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ సమక్షంలో జిల్లా సమావేశం నిర్వహించారు. నూతన పీఆర్సీ రిపోర్ట్ తెప్పించి వెంటనే అమలు చేసేలా చూడాలన్నారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, వివిధ శాఖల్లో పదోన్నతులు కల్పించాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.


