అన్ని సన్న రకాలకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. రైతులు పండించిన ధాన్యం దోడ్డుదా, సన్న ధాన్యమా అని చూడాలి కానీ ఆ రకం వేస్తేనే కొనుగోలు చేసి బోనస్ ఇస్తామనడం రైతు వ్యతిరేక చర్యే.
– ఏలేటి జలేందర్,
ఇటిక్యాల, రాయికల్
పంట వివరాలు తప్పనిసరి
రైతులు సాగు చేసిన ప్రతీ పంట వివరాలు ఏఈవో వద్ద నమోదు చేయించాలి. ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి, మక్క విక్రయించే రైతులు సాగు వివరాలు నమోదు చేయించాలి. సన్న వరి సాగు రైతులు నమోదు చేయించకుంటే కొనుగోలు చేయరు.
– వడ్డెపల్లి భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి


