జిల్లాకేంద్రంలో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
ధర్మపురిలో
నాయకుల ఆందోళన
జగిత్యాల/ధర్మపురి: కల్యాణలక్ష్మీ పథకం రద్దుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని పేర్కొంటూ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కల్యాణలక్ష్మీ పథకం అమలుకు కోర్టు స్టే ఇస్తే.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మీ పథకాన్ని తెస్తే.. కాంగ్రెస్ రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. రైతుబీమా, దళితబంధు, వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. నాయకులు ప్రియాంక, వొల్లాల లక్ష్మీ, రాజేందర్, వెంకటేశ్వర్లు, రమేశ్‌రావు పాల్గొన్నారు. ధర్మపురిలో స్థానిక అంబేడ్కర్ విగ్రహం కూడలి వద్ద జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్సై సధాకర్ తన పోలీస్ సిబ్బందితో వచ్చి సముదాయించారు. అనంతరం నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


