ఎస్‌ఐఆర్‌లో పాల్గొనేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌లో పాల్గొనేలా చూడాలి

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

● రాష్ట్ర సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి

మల్లాపూర్‌: అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌లో వివరాలు అందించేలా చూడాలని సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్‌ ఆగస్టు 3తో ముగుస్తుందని, అప్పటివరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, నాయకులు సిరిపురం రవీందర్‌, కోటగిరి ఆనంద్‌గౌడ్‌, మరిపెల్లి మల్లయ్య, గొట్టిపడత రమేష్‌, ఎర్ర భూమయ్య, బోదాసు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోరుట్లలో ఉద్యోగుల బైక్‌ ర్యాలీ

కోరుట్ల: సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని కోరుతూ టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న జనజాగరణ యాత్ర ఆదివారం కోరుట్లకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాద్యాయులు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కొత్త పెన్షన్‌ విధానాన్ని దర్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరమణ సమయం పెరుగుతున్నప్పటికీ పెన్షన్‌ భద్రత లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. డివిజన్‌ అధ్యక్షుడు సాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌, గడ్డం వెంకటేశ్‌, అంజన్న, చంద్రకాంత్‌, జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేశ్‌, కోకిల కృష్ణ, రాజు పాల్గొన్నారు.

వాగ్దేవి పురస్కారానికి మహేశ్వర శర్మ

రాయికల్‌: జాతీయ వాగ్దేవి పురస్కార్‌ అవార్డుకు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నంత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెరుకు మహేశ్వర శర్మ ఎంపికై నట్లు జాతీయ తెలుగు సారసత్వ పరిషత్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్‌ తెలిపారు. మహేశ్వరశర్మ తెలుగు సాహిత్యంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 28న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రుల చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement