రాయికల్: మండలంలోని బోర్నపల్లి – జగన్నాథ్‌పూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి హోదాలో మొదటి సంతకం చేశారని, రూ.17.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏడాది క్రితం రూ.17.50 కోట్లు మంజూరు చేస్తూ అప్పటి సెక్రటరీ శరత్ చేతుల మీదుగా ఉత్తర్వులు జారీ చేయించారని, తాజాగా అదే బ్రిడ్జి నిర్మాణం కోసం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మళ్లీ మంత్రిని కలవడం.. ఆయన సానుకూలంగా స్పందించడమేంటని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పినట్లు నడుచుకునేందుకే అడ్లూరి మంత్రి అయ్యారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలియకుంటే ఎలా అని హెచ్చరించారు. రాయికల్ – మైతాపూర్, రాయికల్ – రామాజీపేట మధ్య బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తి కాలేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుబొమ్మల నుంచి కుమ్మరిపల్లి వరకు, ఇటిక్యాల నుంచి కాలేజీ వరకు బీటీ రోడ్డు మంజూరైనా నేటికీ పనులు ప్రారంభం కావడం లేదని, వాటిపై దృష్టి సాధించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కౌన్సిలర్ రాకేష్ నాయక్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అనిల్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ యాదవ్, మండల నాయకులు గోపి రాజరెడ్డి, చింతలపెల్లి గంగారెడ్డి, హరీశ్‌రావు, మండ రమేశ్, షంషీర్, నాగరాజు పాల్గొన్నారు.


