జేఎన్టీయూలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్
కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూలో 10000 కోడర్స్ సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు అరవింద్, శ్రీసాయి, మహేంద్ర కంపెనీ విధివిధానాలు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. పదిమందిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేసుకున్నారు. ఎంపికై న వారికి వార్షిక వేతనం రూ.నాలుగు లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఉంటుందని ప్లేస్‌మెంట్ అధికారి సతీశ్‌కుమార్ తెలిపారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ నరసింహ అభినందించారు.


