పెరిగిన విద్యార్థుల హాజరు
కరీంనగర్‌రూరల్: పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్ధుంపూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. 1 నుంచి ఐదో తరగతి వరకు 28 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లు బోధిస్తున్నారు. డిజిటల్ పాఠ్యాంశాల ప్రకారం ట్యాబ్‌తోపాటు నాలుగు కంప్యూటర్లపై విద్యార్థులకు డీఆర్‌పీ, టీచరు సరిత పాఠాలు చెబుతున్నారు. కంప్యూటర్ బోధనతో ఇటీవల విద్యార్థుల హాజరు పెరిగింది.
పాఠశాలలో ఏఐ విద్యాబోధనకు ప్రత్యేక టీచర్‌ను నియమిస్తే బాగుంటుంది. సిలబస్ ప్రకారం విద్యార్థులకు ఏఐ పాఠాలను నేర్పిస్తుండగా ఏఎక్స్‌ఎల్ మాత్రం నిత్యం నేర్పిస్తున్నాం. కంప్యూటర్‌లో పాఠాలు నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
– సరిత, డీఆర్‌పీ,
మొగ్దుంపూర్ ఉపాధ్యాయురాలు
పెరిగిన విద్యార్థుల హాజరు


