ఈజీగా అర్థమవుతుంది
కంప్యూటర్ ద్వారా పాఠాలు చదువుకోవడం, నేర్చుకోవడం చాలా సులువైంది. కంప్యూటర్‌తో నేర్చుకున్న పాఠాలు ఎన్నో రోజులు గుర్తుంటున్నాయి. అక్షరాలను గుర్తించడం, పదాలను ఉచ్చరించడం ఈజీగా మారింది.
– కొమిరె అవంతిక, 4వ తరగతి
విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు లేకపోవడంతో ఒక్కొక్కరికి 45 నిమిషాలు కేటాయించడంతో సమయం సరిపోవడం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ ఏర్పాటు చేయకపోవడంతో నేనే సొంత ఖర్చులతో వైఫై ఏర్పాటు చేసుకొని ఏఐ పాఠాలు బోధిస్తున్న. పక్కనే ఉన్న విద్యావనరుల కేంద్రంలో నెట్‌వర్క్ ఉన్నా ఏఐ బోధనకు పాఠశాలకు కంప్యూటర్లు కేటాయించినా ప్రభుత్వం ఇంట ర్నెట్ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
– తాళ్ల రమేశ్, హెచ్‌ఎం
కంప్యూటర్‌తో పాఠాలు నేర్చుకోవడంతో జవాబులు తప్పులు లేకుండా చదువుకోగలుగుతున్నాం. పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయి. తప్పు అని తేలితే కంప్యూటర్‌లో వెంటనే చెబుతుంది. దీంతో సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
– జి.అరణ్య, 5వ తరగతి విద్యార్థి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత పెరిగింది. ప్రభుత్వ చొరవతో మా పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు ఏఐ విద్యనందిస్తున్నాం. ఏఐతో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో బోధన చేస్తున్నారు. కంప్యూటర్ బోధనతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
– ప్రసన్న కుమారి హెచ్‌ఎం కొత్తూరు
ఈజీగా అర్థమవుతుంది
ఈజీగా అర్థమవుతుంది
ఈజీగా అర్థమవుతుంది


