నాడీ కూడా చూడలేదు
బహ్రెయిన్‌లో అనారోగ్యానికి గురైన మా మామను ఇంటికి తీసుకుని రావడానికి ముందు నిమ్స్‌కు తరలించాం. అక్కడ అంబులెన్స్ నుంచి కిందికి దింపితే నాడి కూడా చూడకుండా ఇంటికి పంపించారు. బహ్రెయిన్‌లోనే వైద్యం అందిస్తే బాగుకాలేదు. మేము ఏమి చేయలేమని చెప్పారు. చేసేది లేక ఇంటికి తీసుకుని వచ్చాం.
– నిరోష్, (నాగయ్య అల్లుడు), బాల్కొండ
నక్క శ్రీనివాస్ అనారోగ్యానికి గురైతే బుధవారం సౌది నుంచి నిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వచ్చాను. ఎన్నో ఆశలతో వస్తే కనీస బాధ్యతగా బెడ్ కూడా ఇవ్వకుండా బయటకు పంపించేశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.
– ఖాజా ముజుమ్మిలోద్దీన్,
కోరుట్ల(సౌదీ అరేబియా)
వలసకార్మికులు అంటే లెక్కలేదా. గల్ఫ్ నుంచి ఇంటికి వస్తే హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిమ్స్‌లోని వైద్యులు బాధ్యతతో వ్యవహరించకపోవడంతో వలస కార్మికులు అసంతృప్తికి గురవుతున్నారు. – మంద భీంరెడ్డి,
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌చైర్మన్


