కారు ఢీకొని మహిళ దుర్మరణం
ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట క్రాసింగ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాళ్లపల్లి లక్ష్మీ (55) మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన శిరోజ్‌కుమార్ తన తల్లి లక్ష్మీతో కలిసి ద్విచక్రవాహనంపై వర్షకొండలోని వారి బంధువు ఇంటికి వెళ్లారు. తిరిగి సిరికొండకు వెళ్తుండగా అమ్మక్కపేట వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనలో లక్ష్మీ, శిరోజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించగా.. లక్ష్మీ మృతిచెందింది. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు.


