రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చిట్టాపూర్–ధర్మారం గ్రామాల మధ్య బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి మండలకేంద్రానికి చెందిన నామ్లవర్ బాలాజీ(40) తన కుటుంబంతో బతుకుదెరువు కోసం రాయికల్ మండలం ఇటిక్యాలకు నాలుగేళ్ల క్రితం వలస వచ్చాడు. బట్టలు ఉతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉపాధి కోసం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చిట్టాపూర్–ధర్మారం గ్రామాల మధ్య రహదారిపై బైక్ ఆదుపుతప్పి కందకంలో పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.


