పోలింగ్ బూత్‌లోకి పోలీసులకు అనుమతి లేదు
టెండర్డ్ ఓటు విధానం
జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒక వ్యక్తి నిర్దిష్టమైన ఓటరుగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు.. అతని ఓటు ఇంతకుముందే ఎవరైనా వేసినట్లు మార్క్‌కాపీలో రికార్డు అయి ఉంటే ప్రిసైడింగ్ అధికారి అతని గుర్తింపుపై సంతృప్తి చెందితే.. ఇతర ఓటర్లకు ఇచ్చిన విధంగానే తన ఓటు మార్క్ చేయడానికి బ్యాలెట్ పేపరు ఇవ్వాల్సి ఉంటుంది.
రాయికల్: సర్పంచ్.. గ్రామానికి ప్రథమ పౌరుడు. గ్రామంలో ఎలాంటి అధికార కార్యక్రమాలు చేపట్టినా ప్రొటోకాల్ ప్రకారం సర్పంచ్‌ను ఆహ్వానిస్తారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.6,500 ప్రభుత్వం చెల్లిస్తుంది. సర్పంచ్ పదవిలో ఉన్న వారికి కొన్ని అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. నెలకోసారి పంచాయతీ పాలకవర్గంతో కలిసి సమావేశం ఏర్పాటు చేయించాలి. రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల ఖాతాలు తనిఖీ చేయాలి. గ్రామాభివృద్ధికి సక్రమంగా నిధులు వినియోగించేలా చూడాలి. మొక్కలు నాటించి.. వాటిలో 85 శాతం మొక్కలు బతికేలా చూడాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకునేలా.. వాటిని వినియోగంలోకి తెచ్చుకునేలా చూడాలి. చెత్తాచెదారం రోడ్లపై వేస్తే రూ.500 జరిమానా విధించే అధికారం కూడా సర్పంచ్‌కు ఉంది.
ఉపసర్పంచ్‌కు గౌరవ వేతనం లేదు
ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పారితోషికం, గౌరవ వేతనం ఉండదు. ప్రజల మనసుల్లో స్థానం సాధించుకునేందుకు ఈ పదవులు దోహదపడతాయి.
సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హులు
సర్పంచ్ తన విధులను సక్రమంగా నిర్వహించకపోయినా.. రెండు నెలలకోసారి చొప్పున మూడుసార్లు గ్రామసభ చేపట్టకపోయినా చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం తన పదవిని కోల్పోతారు. అవినీతి ఆరోపణలు నిరూపణ అయితే ప్రజాప్రతినిథ్య చట్టం 1951 సెక్షన్ 8 కింద పదవి నుంచి తొలగిస్తారు. గ్రామపంచాయతీ ఆడిట్ లెక్కలు పూర్తి చేయకపోతే సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. వార్డు సభ్యులు మూడు సమావేశాలకు.. మహిళాసభ్యులు ఆరు సమావేశాలకు వరుసగా హాజరు కాకపోతే కలెక్టర్ వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది.
అంధత్వం, ఆశక్తి ఓట్లను రికార్డు చేయడం ఇలా..
జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో అంధత్వం, ఏదైనా ఇతర శారీరక ఆశక్తత కారణంగా ఓటరు బ్యాలెట్ పేపర్‌పై ఉన్న గుర్తులను గుర్తించలేకపోయినప్పుడు.. ఇతరుల సహాయం లేకుండా బ్యాలెట్ పేపర్‌పై ముద్ర వేయలేరని ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందినప్పుడు.. ఆ ఓటరు తరఫున బ్యాలెట్ పేపర్‌పై అతని అభీష్టం మేరకు ఓటు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. అవసరమైతే బ్యాలెట్ పేపర్‌ను మడతపెట్టి దానిని బ్యాలెట్ బాక్స్‌లో వేయడానికి.. ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి 18 ఏళ్ల పైబడిన ఓ సహాయకుడిని తనతో తీసుకెళ్లడానికి ఓటరుకు అనుమతిస్తారు.
జగిత్యాలజోన్: ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు పోలీసులకు కూడా అనుమతి లేదు. శాంతిభద్రతలు, ఇతర కారణాలతో సంబంధిత పోలింగ్ అఽధికారి పిలిస్తే తప్ప.. యూనిఫాం వేసుకున్న, సాధారణ దుస్తులు వేసుకున్న పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది పోలింగ్ బూత్‌లోకి వెళ్లరాదు. అలాగే ఓటు వేయడానికి వచ్చే అభ్యర్థికి లేదా ఓటరుకు భద్రతగా వచ్చే పోలీస్ సిబ్బందికి కూడా పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతి లేదు. గన్‌మెన్ ఉన్న వ్యక్తిని పోలింగ్ ఏజెంట్‌గా నియమించరాదు. పోలింగ్ స్టేషన్‌లోకి కేవలం పోలింగ్ అధికారులు, పోటీ చేస్తున్న అభ్యర్థి, అతని ఏజెంట్, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు, ఎన్నికల సంఘం నియమించిన పర్యవేక్షకులు, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఓటరుతోపాటు ఆమె ఎత్తుకున్న చిన్నపిల్లలు, ఇతరుల సహాయం లేకుండా ఓటు వేయలేని వారు, ఓటర్లను గుర్తించే నిమిత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్ నియమించుకున్న వ్యక్తులు మాత్రమే పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించబడతారు.
వేసిన ఓటు ఫొటో తీయడం నిషేధం
జగిత్యాలజోన్: పోలింగ్ బూత్‌లో ఎవరైనా వేసిన ఓటును ఫొటో తీయడం నిషేదం. ఓటరు, అభ్యర్థి, ఏజెంట్ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం కూడా నిషేధం. పోలింగ్ కేంద్రంలో పొగతాగరాదు. ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం బయట, లైన్‌లో నిలబడిన ఓటర్లతో మాట్లాడటానికి, ఫొటోలు తీసుకోవడానికి మీడియా ప్రతినిధులకు ఆంక్షలు లేవు. మీడియా ప్రతినిధులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఫొటోలు తీసుకోరాదు. ఓటర్ కాని వ్యక్తిని పోలీంగ్ స్టేషన్ లోపలికి అనుమతించడానికి జిల్లా ఎన్నికల అధికారికి కూడా అధికారం లేదు.
గిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒక్కోవార్డుకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారికి పోలింగ్ బ్యాలెట్ బాక్స్‌లను అప్పగించాలి. అలాగే వారు పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన పేపర్లు, సామగ్రిని అధికారికి అప్పగించాలి.
మొదట లెక్కించాల్సింది పోస్టల్ బ్యాలెట్ పేపర్లు
జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటింగ్ లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లనే లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల్లో ఉన్న ఓట్లను లెక్కించి రిటర్నింగ్ అధికారి సమక్షంలో లెక్కింపు పూర్తి చేస్తారు.
సర్పంచ్ గౌరవ వేతనం రూ.6,500
రిటర్నింగ్ అధికారికే బ్యాలెట్ బాక్స్‌ల అప్పగింత
పోలింగ్ బూత్‌లోకి పోలీసులకు అనుమతి లేదు
పోలింగ్ బూత్‌లోకి పోలీసులకు అనుమతి లేదు
పోలింగ్ బూత్‌లోకి పోలీసులకు అనుమతి లేదు
పోలింగ్ బూత్‌లోకి పోలీసులకు అనుమతి లేదు


