ప్రశాంత వాతావరణంలో ఓటేయండి
● మొదటి విడతలో 1172 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. సుమారు 2005 మంది ఓపీవోలను నియమించాం. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ● ఎన్నికల సామగ్రి పంపిణీకి పటిష్ట చర్యలు తీసుకున్నాం. సామగ్రితో సిబ్బంది ఇప్పటికే అన్ని గ్రామాలకు చేరుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం. ● పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. 200 మీటర్ల పరిధిలో అనధికారికంగా వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. ● పోలీసులు పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయకుండా కట్టుదిట్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ● పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ప్రతి ఒక్క విషయంపై అవగాహన కల్పించాం. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పోలింగ్ నిర్వహించాలని సూచనలు చేశాం. ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పలు చోట్ల వెబ్‌కాస్టింగ్ పూర్తి చేశాం. ● ఎన్నికల ప్రవర్తన నియమవళిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అన్ని మండలాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్తాయిలో పర్యవేక్షిస్తున్నాయి.
● ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాం. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ● జిల్లాలోని ఏడు మండలాలు మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నంలోని మొత్తం 122 గ్రామపంచాయతీలు, 1172 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నాం. సిబ్బందిని పూర్తిస్తాయిలో నియమించాం. మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందించాం. వారు సామగ్రితో ఆయా గ్రామాలకు చేరుకున్నారు.
మొదటి విడత పోలింగ్‌లో ఎంతమంది సిబ్బందిని నియమించారు..?
ఎన్నికల సామగ్రి పంపిణీ..?
పోలింగ్ కేంద్రాల వద్ద..?
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి చర్యలు చేపట్టారు..?
పోలింగ్ సిబ్బందికి శిక్షణ..?
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చర్యలు?
ఎన్నికల నియామవళి అమలుకు చర్యలు..?
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారా?
జగిత్యాల: జిల్లాలో మొదటి విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. అవసరమైన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించామని వివరించారు. పోలింగ్ బాక్స్‌లు, బ్యాలెట్‌పత్రాలు సిద్ధం చేశామన్నారు. మొదటి విడత పోలింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.
మొదటి విడత ఎన్ని మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
ప్రలోభాలకు లొంగకూడదు
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభం
‘సాక్షి’తో కలెక్టర్ సత్యప్రసాద్
1/1
ప్రశాంత వాతావరణంలో ఓటేయండి