అందుబాటులోకి సర్వైకల్ వ్యాక్సిన్
● డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్
జగిత్యాల: సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాక్సిన్ ప్రభుత్వం ద్వారా త్వరలోనే పంపిణీ చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐఎంఏ హాల్‌లో సూపర్‌వైజర్లకు వ్యాక్సిన్‌కు సంబంధించి శిక్షణ కల్పించారు. 14 ఏళ్లలోపు అమ్మాయిలకు ఈ సర్వైకల్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, ప్రస్తుతం ఇది ప్రైవేటులోనే అందుబాటులోనే ఉందని, తాజాగా ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. సూపర్‌వైజర్లకు ఈ వ్యాక్సిన్ ఎలా వేయాలన్న అంశంపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
పీవో, ఏపీవోల పాత్ర కీలకం
● అడిషనల్ కలెక్టర్ లత
మెట్‌పల్లిరూరల్: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పీవో, ఏపీవోతోపాటు ఇతర అధికారులకు పలు విషయాలపై వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని సూచించా రు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఎన్నికల అబ్జర్వర్ రమేశ్, డీపీవో రఘువరన్ డిస్ట్రిబ్యూషన్ తీరు ను పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీ ల్దార్ నీత, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ కాంతయ్య పాల్గొన్నారు.
కూర లేక ఇబ్బందులు పడ్డ ఎన్నికల సిబ్బంది
ఇబ్రహీంపట్నం : మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్ వద్ద ఎన్నికల డిస్టిబ్యూటర్ కేంద్రంలో బుధవారం పోలింగ్ కేంద్రాల సామగ్రిని తీసుకుని భోజనం చేసేందుకు సిబ్బంది వెళ్లగా కూర లేక ఇబ్బంది పడ్డారు. ముందుగా భోజనం చేసిన సిబ్బందికి మాత్రమే కూరలు సరిపోవడంతో చివరిలో భోజనం చేసేందుకు వచ్చిన సిబ్బందికి కూరలు లేకపొవడంతో అన్నం పెట్టుకుని, కొందరు పెరుగుతో, మరికొందరు తెల్ల అన్నంనే తిని కడుపునింపుకున్నారు. కొందరు ఉపాధ్యాయులు అయితే సరిపడా ఎందుకు వంటలు వండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెమ్యూనరేషన్ ఒకేలా ఇవ్వాలని వినతి
కోరుట్లటౌన్: ఎన్నికల సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ఒకేలా రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్‌కు ఆర్‌టీపీపీ రాష్ట్ర సహాధ్యక్షుడు వేల్పుల స్వామి యాదవ్ విన్నవించారు. కోరుట్ల ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో వినతి పత్రం అందించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట ఓ టింగ్, కౌంటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఎన్నికల మరుసటి రోజు ఓడి కల్పించాలని అదనపు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
జగిత్యాలటౌన్: పంచాయితీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులకు కార్మిక సహాయ కమిషనర్ సురేందర్ సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా కార్మికులకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై 1988 సెక్షన్(13) కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అందుబాటులోకి సర్వైకల్ వ్యాక్సిన్
అందుబాటులోకి సర్వైకల్ వ్యాక్సిన్


