మెడికల్ కళాశాల పూర్తయ్యేదెప్పుడు..?
జగిత్యాల: జిల్లాకో మెడికల్ కళాశాల ఉండాలనే విజన్‌తో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, ఇందులో భాగంగా జగిత్యాలకు వైద్య కళాశాల మంజూరు చేసి 80శాతం పనులు పూర్తి చేసినా.. మిగిలిన 20శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలను బుధవారం సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కడికో వెళ్లి చదువుకోకుండా ఇక్కడే కళాశాలను ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మెడికల్ కళాశాలలో హాస్టల్, కళాశాల, ల్యాబ్‌లు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ 80శాతం కేసీఆర్ పూర్తి చేశారని, మిగతా 20 శాతం రెండేళ్లయినా పూర్తి చేయడంలేదని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీకి తాము మద్దతు ఇస్తామని, అదే సమయంలో మెడికల్ కళాశాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
కేసీఆర్ హయాంలోనే 80 శాతం పూర్తి
20 శాతం పనులు కూడా చేపట్టలేకపోతున్నారు
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


