ఘనంగా మల్లన్నస్వామి జాతర ఉత్సవాలు
కథలాపూర్‌లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బంది
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం దండివారం సందర్భంగా సుమారు 18 వేల మంది భక్తులు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్.సుప్రియ, జగిత్యాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ రాజమౌళి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.65,270 ఆదా యం సమకూరింది. ఫౌండర్ ట్రస్టీ కొండూరి శంతయ్య, ఈవో ముద్దం విక్రం, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, ధర్మపురి ఎస్సై మహేశ్, అర్చకులు రాజేందర్, పోలీస్ సిబ్బంది, సిబ్బంది పెడివెల్లి నర్సయ్య, రాజేందర్, శివకేశవ్, గంగాధర్ పాల్గొన్నారు.


