ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు
మెట్‌పల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గ్రామాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య తరలించామని, ఇందుకోసం ప్రత్యేకంగా రూట్ మొబైల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్కార్ట్ సహాయంతో పోలింగ్ సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్‌బాటిళ్లు తీసుకెళ్లరాదని, సెల్ఫీలు దిగడం నిషేధమని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్‌కుమార్


