ఎన్నికల సిబ్బందికి వసతులు కల్పించాలి
ఇబ్రహీంపట్నం: పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ లత, అబ్జర్వర్ రమేశ్ వేర్వేరుగా పరిశీలించారు. ఆర్‌వోలు, పీవోలు గైర్హాజరు అయితే సమాచారం అందించాలని తెలిపారు. సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో వెళ్లగానే పోలింగ్ స్టేషన్‌ల వద్ద వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిప్ప గణేశ్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈవో మధు, తదితరులు పాల్గొన్నారు.


