పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’ | - | Sakshi
Sakshi News home page

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’

Dec 10 2025 7:39 AM | Updated on Dec 10 2025 7:39 AM

పల్లె

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’

ఊరంతా మద్యం మత్తు పైసలతోనే ‘పంచాయతీ’ సొంత ఎజెండాలతో హామీలు కాంట్రాక్టు పనులు ఇస్తామని.. యువ‘కుల’కు గాలం

పంచాయతీ ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఇంటింటి ప్రచారంతో అలసి, సొలసిన మద్దతుదారులకు, పార్టీ కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ చీప్‌ లిక్కర్‌, బాంద్రి, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మందు విక్రయాలు బాగా పెరిగి పల్లెలు మత్తులో జోగుతున్నాయి. పోలీసు యంత్రాంగం దాడులతో ‘బెల్టు’ షాపులకు తాళాలు పడగా, గతంలో ఎన్నడూ లేనంతగా బెల్టుషాపులను నియంత్రించారు. కానీ, దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.

సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలతో, పార్టీ గుర్తులతో, బీ–ఫామ్‌లతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. పార్టీల రంగులు, జెండాలు పల్లె పొలిమెరల్లోనే రెపరెపలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పల్లెలను ‘పంచభూతాలు’ ఆవహించాయి. ఎన్నికలను అవి శాసిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే శక్తిని ప్రదర్శిస్తున్నాయి. హామీలను ఎరగా వేసి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరు ప్రయత్నాలు ప్రారంభించారు.

రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయి లాభసాటి వ్యాపారంలా పరిణమించాయి. ఎంత వెచ్చించాం, ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలువాలనేది అభ్యర్థుల లక్ష్యంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు అసలు కార్యానికి తెరలేపారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 పంపిణీ చేసేందుకు డబ్బు సంచులను సిద్ధం చేశారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, కులసంఘాల పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అనేక మంది ఎన్నికల్లో ఉండడంతో డబ్బుకు వెనకాడకుండా వెదజల్లుతున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు.

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎజెండాలు ఏమీ లేకుండా సొంత ఎజెండాలతో అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఊరిలో సొంత ఖర్చులతో ఫ్యూరీఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఉచితంగా మంచినీరు అందిస్తామని, ఊరిలో ఆడపిల్ల పుడితే.. రూ.10వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ఊరందరికీ డిష్‌ బిల్లు లేకుండా ఫ్రీగా టీవీ కనెక్షన్లు, పల్లె దవాఖానా నిర్మిస్తామని, ఇంటింటికీ సీసీ రోడ్డు వేస్తామని సొంత ఎజెండాలతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ‘మీ సామాజిక వర్గానికి భవనాలను కట్టిస్తాం’ అని రకరకాల హామీలిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు యథాశక్తిగా ప్రయత్నిస్తున్నారు.

అనుకూలంగా, అందుబాటులో ఉండే అనుయాయులకు సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టు ఇప్పించి కాసులు దోచిపెడుతామంటూ నేతలు హామీలిస్తున్నారు. ఊరిలో ఏం చేయాలన్నా పంచాయతీ తీర్మానాలు ఇస్తామని చెబుతున్నారు. ‘గెలిస్తే చాటుగా మీ అందరికి నేనున్నా’ అంటూ అనుచరులకు నమ్మబలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికప్పుడు సెల్‌ఫోన్లు కొనిస్తూ, ద్విచక్ర వాహనాలు సమకూర్చుతూ ఎన్నికల ప్రచారానికి యువతరాన్ని వినియోగించుకుంటున్నారు. ‘నేను గెలిస్తే భవిష్యత్‌ ఉంటుందంటూ ఆశలురేపుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు హామీలతో ఎన్నికల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ పంచభూతాలు ఎన్నికల్ని ఆవహించి ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వివిధ రకాల కుల సంఘాలు, వృత్తిసంఘాలు, యువజన సంఘాలకు గాలమేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. యువకులకు క్రికెట్‌ కిట్లు ఇస్తూ, యువజన సంఘాలు కట్టిస్తామని, ఓపెన్‌జిమ్‌లు నిర్మిస్తామని, కోతులను తరిమేస్తామని, సామాజిక భద్రత కల్పిస్తామని హామీలిస్తున్నారు. యువకులను గోవా లాంటి ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇలా పల్లెల్లో సెల్‌ఫోన్‌ మెస్సేజ్‌లు చేస్తున్నారు. ‘చెప్పిన పనులు చేయకుంటే చెప్పులు మెడలో వేసుకుంటాం, గాడిదమీద ఊరేగించండి’ అని బాండు పేపర్లు రాసిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలను ఆవహించిన ప్రలోభాలు

గెలుపే లక్ష్యంగా ఎత్తులు.. పైఎత్తులు

సొంత ఎజెండా.. అభివృద్ధికి హామీలు.. బాండు పేపర్లు

గ్రామాల్లో పట్టు కోసం నేతల ప్రయత్నాలు

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’1
1/4

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’2
2/4

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’3
3/4

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’4
4/4

పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement