అండర్‌– 19 వైస్‌ కెప్టెన్‌గా శ్రీవల్లి | - | Sakshi
Sakshi News home page

అండర్‌– 19 వైస్‌ కెప్టెన్‌గా శ్రీవల్లి

Dec 10 2025 7:39 AM | Updated on Dec 10 2025 7:39 AM

అండర్

అండర్‌– 19 వైస్‌ కెప్టెన్‌గా శ్రీవల్లి

అండర్‌– 19 వైస్‌ కెప్టెన్‌గా శ్రీవల్లి పార్థివదేహాలు.. మెడికోలకు పాఠ్యపుస్తకాలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ మహిళల అండర్‌– 19 క్రికెట్‌ జట్టుకు కరీంనగర్‌కు చెందిన కట్ట శ్రీ వల్లీ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికై ంది. ఫాస్ట్‌ బౌలర్‌గా రాణిస్తున్న శ్రీవల్లీ గతంలో అండర్‌–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. తాజాగా హెచ్‌సీఏ అండర్‌ 19 జట్టును ప్రకటించగా శ్రీవల్లీని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి నుంచి లక్నో వేదికగా బీసీసీఐ అండర్‌–19 ఉమెన్‌ వన్డే ట్రోపీ జరుగనుంది. శ్రీవల్లి ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమా లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

తల్లి బాగోగులు చూసుకోవడం లేదని ఫిర్యాదు

చొప్పదండి: పట్టణానికి చెందిన వృద్ధురాలి బాగోగులు పెద్ద కుమారుడు చూసుకోవడం లేదని ఆర్డీవో కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తల్లితండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను అనుభవిస్తూ, రెండు నెలలుగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని పెద్ద కుమారుడు పట్టించుకోవడం లేదని, తల్లితండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తిరిగి తల్లికి స్వాధీనం చేయాలని బాధితురాలి తరుఫున ఫిర్యాదులో పేర్కొన్నారు.

కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా

మానకొండూర్‌ రూరల్‌: మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్‌–వరంగల్‌ రహదారిపై కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నర్సంపేట జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందినవారు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మానకొండూర్‌ శివారు తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రాగా.. తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముత్యాల కవిత, పెండ్లి యాదమ్మ, పెండ్లి నీల, పెండ్లి లక్ష్మి, పెండ్లి సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్‌లో దేహదాతకు నివాళి అర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి(92) ఈనెల 6న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు శ్యాంసుందర్‌రెడ్డి తనతండ్రి పార్ధివదేహాన్ని సిమ్స్‌కు దానంచేశారు. ఆయన మనుమరాలు వర్ష, మనుమడు వర్షిత్‌కు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.అనాటమీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ శశికాంత్‌ కిరాగి,డాక్టర్‌ కల్పన ఉన్నారు.

అండర్‌– 19 వైస్‌ కెప్టెన్‌గా శ్రీవల్లి1
1/1

అండర్‌– 19 వైస్‌ కెప్టెన్‌గా శ్రీవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement