సోనియాతోనే ప్రత్యేక రాష్ట్రం
ధర్మపురి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఇచ్చిన మాటను సోనియా నిలబెట్టుకున్నారని తెలిపారు. నాయకులు వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, చిలుముల లక్ష్మణ్, రాందేని మొగిలి తదితరులున్నారు.
రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదే
జగిత్యాలటౌన్: ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సోనియా సాహసోపేత నిర్ణయం తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దు ర్గయ్య, గాజుల రాజేందర్, హనుమండ్ల జయ శ్రీ, రాంచంద్రారెడ్డి, రఘువీర్‌గౌడ్ ఉన్నారు.
ఎన్నికల సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తెలిపారు. మొదటి విడత ఎన్నికకు పోలింగ్ అధికారులు 1406, ఇతర అధికారులు 2005 మందిని నియమించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌లు, పోస్టల్ బ్యాలెట్ తరలింపు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఎస్పీ అశోక్‌కుమార్, అబ్జర్వర్లు రమేశ్, డీపీవో రఘువరణ్ పాల్గొన్నారు.
పెరుగుతున్న చలి
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. భీమారం మండలం మన్నెగూడెంలో 9.1, కథలాపూర్‌లో 9.1, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 9.3, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 9.4, ఎండపల్లి మండలం గుల్లకోటలో 9.5, మల్లాపూర్‌లో 9.5, పెగడపల్లిలో 9.6, మేడిపల్లిలో 9.6, ధర్మపురి మండలం నేరేళ్లలో 9.6, భీమారం మండలం గోవిందారంలో 9.7, మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో 9.8, రాయికల్‌లో 9.8, కొడిమ్యాల మండలం పూడూరులో 9.9, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 9.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
ఆలయ అభివృద్ధికి సహకరించండి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంగళవారం పట్టణానికి చెందిన ఇళ్ల యజమానులతో సమావేశమయ్యారు. ఆల య అభివృద్ధికి 2.07 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇళ్లు కోల్పో యే వారికి పునరావాసం కల్పిస్తామని, ఆలయ పరిసరప్రాంత ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు.
సోనియాతోనే ప్రత్యేక రాష్ట్రం
సోనియాతోనే ప్రత్యేక రాష్ట్రం
సోనియాతోనే ప్రత్యేక రాష్ట్రం


