కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్రం
మెట్‌పల్లి: కేసీఆర్ కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమా ల వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగా ణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కా ర్యక్రమంలోపలువురు నాయకులు పాల్గొన్నారు.
కోరుట్లలో విజయ్ దివస్
కోరుట్ల: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అవినీతిని నిర్మూలిద్దాం..
జగిత్యాల: అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, 1064 టోల్‌ఫ్రీ నంబర్‌తో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఉద్యోగులు నిబద్ధతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం ఇవ్వాలని వేధిస్తే 1064 టోల్‌ఫ్రీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్రం
కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్రం


