సోషల్ మీడియాలో ప్రచారం
రాయికల్:పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎలాంటి ఖర్చు లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము గెలిస్తే చేసే అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో యువకులు, మహిళలు గ్రామాభివృద్ధి కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, ఎన్‌ఆర్‌ఐ, ఆలయాల అభివృద్ధి కమిటీ అంటూ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గ్రూపు సభ్యులుగా ఉంటూ తాము పోటీ చేస్తున్న సమయంలో రోజువారి కార్యక్రమాలను పోస్ట్ చేయడంతోపాటు, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తన గుర్తు ఇది అని, తన గుర్తుకే ఓటు వేయాలంటూ కోరుతున్నారు.
వీడియోలు, ఫొటోస్‌తో సందేశాలు
అభ్యర్థులు గతంలో చేసిన అభివృద్ధి పనులను వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. రోజువారి కార్యక్రమాలను కూడా మెసేజ్ చేస్తూ తమకు అవకాశం కల్పిస్తే చేపట్టబోయే పనులు కూడా వివరిస్తున్నారు. గ్రామంలో నిరక్షరాస్యులకు వాయిస్ రికార్డులు పంపిస్తున్నారు.


