బ్యాలెట్ బాక్స్ సీజ్ చేసేటప్పుడు ఏజెంట్ల సంతకం తప్పన
జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ రోజు బ్యాలెట్ బాక్స్‌లను ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల ఏజెంట్లకు ఓపెన్ చేసి చూపించి దానిని శుభ్రం చేసి ఏజెంట్ల సంతకంతో కూడిన పత్రాన్ని అంటించి సీజ్ చేస్తారు. కౌంటింగ్ సమయంలో కూడా ఏజెంట్ల ముందే బ్యాలెట్ బాక్స్ సీజ్ తొలగించి ఏజెంట్లు సంతకం చేసిన పత్రాన్ని పోలింగ్ ఏజెంట్లకు చూపించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. కౌంటింగ్‌కు ముందు కూడా ఏజెంట్ల సంతకాలు పత్రంపై తీసుకుని వారికి ఎన్నికల కౌంటింగ్ మొదలు పెడుతున్నట్లు ప్రిసైడింగ్ అధికారి తెలుపుతారు. 50 బ్యాలెట్ పేపర్లను కట్టకట్టి పూర్తయిన తర్వాత అభ్యర్థులకు గుర్తులు ఇచ్చిన బాక్స్‌లను టేబుళ్లపై పెట్టి ఓట్లను ఆయా గుర్తులు ఉన్న బాక్స్‌ల్లో వేస్తారు. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి ఎన్నికల ఫలితాన్ని తేలుస్తారు.


