చింతలూరు.. ఆరుసార్లు ఏకగ్రీవం
రాయికల్: మండలంలోని చింతలూరు గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరుసార్లు సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1981లో పంచాయతీగా ఏర్పడగా.. తొలిసారిగా భద్రీనాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 1988 వరకు పదవిలో ఉన్నారు. 1988–95 ఎన్నికల్లో అనుపురం లింబాగౌడ్, 2001లో ఓరుగంటి మోహన్‌రావు, 2006లో లక్ష్మణ్‌నాయక్, 2014లో కదుర్ల లక్ష్మీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019లో తొలిసారి గ్రామస్తులంతా సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో అనుపురం శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.


