పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు
అన్నా.. ఓటేయడానికి తప్పక రావాల్నె..
పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
జాబితాపూర్‌లో తల్లీకొడుకులు పోటీ
రాయికల్: పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. ప్రతి ఓటూ కీలకంగా మారనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఉదయం నుంచే ఇంటింటికీ వెళ్తున్నారు. ఓటర్లు కూడా వచ్చిన ప్రతి అభ్యర్థిని ఆదరిస్తున్నారు. ఎవరొచ్చినా ఓటు వేస్తామంటూ హామీ ఇస్తున్నారు.
గ్రామాల్లో సైలెంట్ ఓటింగ్
పల్లెపోరులో సైలెంట్ ఓటింగ్ ఎక్కువ కానుంది. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నా.. ఎక్కడ మాట జారినా గొడవలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో ఓటర్లు ప్రచారానికి ఎవరు వచ్చినా వారి మనసు నొప్పించకుండా తమకే ఓటు వేస్తామంటున్నారు. ఇది సైలెంట్ ఓటింగ్‌కు దారితీసే పరిస్థితి ఉందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.
పట్టణాల నుంచి గ్రామాల్లోకి
పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపించిన నేపథ్యంలో ఉపాధి నిమిత్తం హైదరాబాద్, భీవండి వంటి ప్రాంతాలకు వసల వెళ్లినవారిని ఎలాగైనా ఇక్కడకు రప్పించేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల ఫోన్ నంబర్లు తెలుసుకుని ఫోన్లు చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు బస్, ట్రైన్ చా ర్జీలు భరిస్తామంటున్నారు. వీలునుబట్టి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా అమౌంట్ పంపిస్తున్నారు.
గ్రామాల్లో విందులు
గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా విందు రాజకీయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వార్డు సభ్యులు ఆయా వార్డుల్లోని కుల సంఘాల నాయకులకు డబ్బులు అప్పగిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. యువత, వృద్ధులు, కుల సంఘాల సభ్యులకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రెండుమూడు రోజులుగా విందులు ప్రారంభమయ్యాయి.
ప్రచారానికి పట్టణం నుంచి పల్లెకు..
కోరుట్ల: పల్లెల్లో ఎన్నికలు ఉన్నాయంటే పట్టణాల్లో ఉన్నవారు నీరసపడే రోజులు పోయాయి. పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఊళ్లల్లో ప్రచారం కోసం మహిళలు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో సమీప పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను సంప్రదిస్తున్నారు. రోజుకు రూ.500 ఇచ్చి ప్రచారం కోసం తీసుకెళ్తున్నారు. కోరుట్ల పట్టణంలోని కొన్ని మహిళా సంఘాల సభ్యులు రెండురోజులుగా పక్కనే ఉన్న అయిలాపూర్, మోహన్‌రావుపేట వంటి మేజర్ గ్రామ పంచాయతీలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
మల్లాపూర్: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. అధికారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. జెడ్పీ డిప్యూ టీ సీఈవో నరేశ్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రా ణి, సీనియర్ అసిస్టెంట్ మహేశ్, రిటర్నింగ్ అధి కారులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
జగిత్యాల: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈనెల 10, 11తేదీల్లో సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రెండో విడత ఎన్నికలు జరిగే జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్, మల్యాల, కొడిమ్యాలలో ఈనెల 13, 14న, మూడో విడత ఎన్నిక జరిగే ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, పెగడపల్లి, గొల్లపల్లిలో ఈనెల 16, 17న పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపారు.
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం జాబితాపూ ర్ సర్పంచ్‌గా తల్లీకొడుకులు బరిలో నిలిచారు. ఇప్పటికే జాబితాపూర్ సర్పంచ్‌గా పనిచేసిన అంకం మమత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె భర్త అంకం సతీశ్ ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలబడ్డారు. సతీశ్ తల్లి మల్లవ్వ కూడా సర్పంచ్ బరిలో నిలిచారు. తల్లీకొడుకుల్లో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే.
పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు
పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు
పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు
పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు


