ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో అవలంబించాల్సిన విధివిధానాలుపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీటింగ్ అరెంజ్‌మెంట్, సీక్రెట్ ఓటింగ్, కంపార్ట్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ స్వరూప, ఎమ్మార్వో కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. ఆరుగురు బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
‘పది’లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
రాయికల్: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో రాము సూచించారు. సోమవారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని, గైర్హాజరైతే ఎందుకు రాలేదో ఇంటికి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.
స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఫ్లాగ్‌మార్చ్
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్, జాబితాపూర్ గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్‌మా ర్చ్ నిర్వహించామన్నారు. స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా.. గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ఉమాసాగర్, గీత, సుధీర్‌రావు, రాజు పాల్గొన్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జగిత్యాల: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్ మీడియెట్ నోడల్ అధికారి నారాయణ అన్నారు. సోమవారం ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు. అధ్యాపకులు సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ సకాలంలో పూర్తి చేయాలని, ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి ఓజేటీకి పంపిస్తూ వారికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలన్నారు. అధ్యాపకులు శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కంకనాల శ్రీనివాస్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్


