వైభవంగా అయ్యప్ప ఆరట్టు
మెట్‌పల్లి: అయ్యప్పస్వామికి ఆరట్టు
ఉత్సవాన్ని మెట్‌పల్లి పట్టణంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కేరళ వాయిద్యాల మధ్య స్వాముల భజనలు, నృత్యాలతో చెన్నకేశవనాథ ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి కోనేరులో పుణ్యస్నానం చేయించి పంచామృతాలతో అభిషేకం చేశారు. తిరిగి అయ్యప్ప ఆలయానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు అంకతి భరత్ పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్ప ఆరట్టు


