ఆత్మజ్ఞాన మార్గంలో నడవండి
కోరుట్లటౌన్: అహంకారభారాన్ని వదిలి ఆత్మజ్ఞాన మార్గంలో నడవాలని గర్రెపల్లి మహేశ్వర శర్మ అన్నా రు. పట్టణంలోని శ్రీ వాసవి కల్యాణ భవనంలో శ్రీవిష్ణు మహాపురాణం ప్రవచనాల కార్యక్రమం జరిగింది. జడభరుతుని వృత్తాంతం, భక్త ప్రహ్లాద చరిత్ర, శ్రీనారసింహస్వామి ఆవిర్భావం తెలిపారు. ప్రహ్లాదుడు చెప్పే సత్యం, భక్తి, ధర్మం ఎప్పుడూ ఓడవవని, భగవంతుడు భక్తుని పిలుపు వినడానికి సిద్ధంగా ఉంటాడని అన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి నిర్వాహకులు మంచాల జగన్, హరికృష్ణ, రాజారాం, శ్రీనివాస్, రాజు, సుందర వరదరాజన్, భృగు మహర్షి, నారాయణ, చిన్నరాజన్న, ప్రవీణ్, సుధాకర్, శివకుమార్, రవీందర్, శైలజ, పద్మావతి, భక్తులు హాజరయ్యారు.


