ప్రభుత్వ అరాచకానికి బీసీ బిడ్డ బలి
రాయికల్: కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకానికి బీసీ బిడ్డ ఈశ్వరాచారి బలయ్యాడని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఈశ్వరాచారి చిత్రపటానికి ఆదివారం నివాళులర్పించారు. కేంద్రంతో ఒప్పించి చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా సీఎం ఒత్తిడి తేవాలని, అవసరమైతే అఖిలపక్షం నాయకులతో కలిసి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని కోరారు. యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో వేణు రచించిన ఎత్తురా జెండా సీడీని ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్లు ఎనుగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణిసాయికుమార్, తురగ శ్రీధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సాయికుమార్, మహేశ్ గౌడ్, మహేందర్ పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత


