హోంగార్డుల సేవలు వెలకట్టలేనవి
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని, పోలీసు సిబ్బందికి దీటుగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావం సందర్భంగా శనివారం ఎస్సీ కార్యాలయంలో ఆఫీసర్స్ పరేడ్ నిర్వహించారు. గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్‌ను తిలకించారు. ట్రాఫిక్ నిర్వహణ, ఉత్సవాలు, ఎన్నికల బందోబస్తు, నైట్ పెట్రోలింగ్, నేరాల నిరోధం వంటి పనిల్లో సేవలు అందిస్తున్నారని అభినందించారు. వారి సంక్షేమం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి సహకరిస్తామన్నారు. అనంతరం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. కళాబృందం సభ్యులను సన్మానించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ సీఐలు కిరణ్‌కుమార్, సైదులు, వేణు, ఆర్‌ఎస్సైలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన పీఎంశ్రీ స్కూల్ స్పోర్ట్స్ మీట్
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో నిర్వహించిన పీఎంశ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. డీఈవో రాము, సెక్టోరియల్ అధికారి కొక్కు రాజేశ్ ఎస్జీఎఫ్ సెక్రెటరీ చక్రధర్, పెటా అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, పీఈటీలు పిడుగు భాస్కర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, అంజయ్య క్రీడాకారులు పాల్గొన్నారు.
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
మల్యాల: గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. మందుల నిల్వలు, రికార్డులు, వ్యాక్సిన్లు పరిశీలించారు. ల్యాబ్ తనిఖీ చేశారు. డయాగ్నొస్టిక్ పరికరాలపై ఆరా తీశారు. ఆరోగ్య సంబంధిత చికిత్సలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని గర్భిణులకు సూచించారు. ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలని, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ మాత్రలు వేసుకోవాలన్నారు. మండల వైద్యురాలు మౌనిక, పీహెచ్‌ఎన్ నాగలక్ష్మీ, రమేశ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకాలు వినియోగించుకోవాలి
గొల్లపల్లి: చిన్నారులు, గర్భిణులు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా అందించే టీకాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని బీబీరాజ్‌పల్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. టీకాల పంపిణీ తీరును పరిశీలించారు. ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీకాల విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్‌ఎంలు దేవేందరమ్మ, పుష్పలత పాల్గొన్నారు.
హోంగార్డుల సేవలు వెలకట్టలేనవి
హోంగార్డుల సేవలు వెలకట్టలేనవి
హోంగార్డుల సేవలు వెలకట్టలేనవి


