కనుల పండువగా ఆరట్టు
రాయికల్:రాయికల్ పట్టణంలో ఆరట్టు ఉత్సవాన్ని శనివారం కనులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు సత్యనారాయణశర్మ, సాయి సుధీర్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. గాంధీచౌక్, పాతబస్టాండ్, చెరువు వరకు శోభాయాత్ర చేపట్టారు. అయ్యప్ప మాలధారుల భజనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అయ్యప్ప నామస్మరణతో పట్టణం మార్మోగింది. అనంతరం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గురుస్వాములు మచ్చ శ్రీధర్, సింగని రమేశ్, సాంబారి శ్రీను, ఎనగందుల రాజు, పారిపల్లి శ్రావణ్, అజయ్, భార్గవ్, కై రం సత్యంగౌడ్ పాల్గొన్నారు.
కనుల పండువగా ఆరట్టు


