ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వండి
కథలాపూర్: మండలం కలిగోట శివారులో నిర్మించనున్న సూరమ్మ ప్రాజెక్ట్ కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి విన్నవించారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఇప్పపల్లి రైతులతో ఆర్డీవో సమావేశమయ్యారు. గ్రామం పరిధిలో 39.11 ఎకరాలు కాలువ పనుల్లో కోల్పోతున్నారని, ఇందుకు ప్రభుత్వం పరిహారం కింద ఎకరాకు రూ.8.64 లక్షలుగా నిర్ణయించిందన్నారు. రైతులు మాట్లాడుతూ రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపారు. తహసీల్దార్ వినోద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాగండ్ల రమేశ్‌గౌడ్, ఆర్‌ఐలు నగేశ్, రవీందర్ పాల్గొన్నారు.


