‘రోళ్లవాగు’కు అనుమతి ఇవ్వండి
● నగర్‌వన్ యోజన కింద పెండింగ్ నిధులివ్వండి ● మంత్రి భూపేంద్రయాదవ్‌కు ఎంపీ అర్వింద్ వినతి
జగిత్యాల: రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు అనుమతులు వేగవంతం చేయాలని, నగర్‌వన్ యోజన కింద పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్‌కు ఎంపీ అర్వింద్ వినతిపత్రం సమర్పించారు. బీర్‌పూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు కావాలని కోరారు. జగిత్యాల అర్బన్ మండలంలో అర్బన్ ఫారెస్ట్‌ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నగర్‌వన్ యోజన కింద రూ.2 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో ఇదివరకే రూ.1.4 కోట్లు విడుదల కాగా.. రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలి
రాయికల్: సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి సూచించారు. శనివారం రాయికల్ మండలం అల్లీపూర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఠాణాను తనిఖీ చేసి రికార్డులపై ఆరా తీవారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి సారించాలని సూచించారు. ఏయే గ్రామాల్లో సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారో.. ఆ గ్రామాల్లో బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. విధులపై ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుదాకర్, ఎస్సై సుధీర్‌రావు ఉన్నారు.


