ఉద్యోగంలో సంతృప్తి లేక
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం నాగులమల్యాల మాది. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఈఈఈ) చేశా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మన్ లాంగ్వేజీ పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలని భావించా. ఇక్కడే కార్పోరేట్ ఉద్యోగం దొరికింది. నాగులమల్యాల సర్పంచ్ అభ్యర్థి జనరల్ మహిళలకు కేటాయించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో నిలిచాను. ఉద్యోగంలో అనుకున్న సంతృప్తి లేకపోవడం..ఇదివరకే వర్సిటీ స్థాయిలో విద్యార్థి నాయకురాలిగా చేసిన అనుభవం ఉండటంతో పోటీలో నిలిచాను. తండ్రి రాజాగౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా చేసి ఓడిపోయారు. – మల్యాల జాహ్నవి, బీటెక్ (ఈఈఈ)


