గ్రామాలు నిర్లక్ష్యానికి గురైనందుకే
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసారు. ఉన్నత విద్య అనంతరం గృహిణిగా కొనసాగుతున్నా. కమాన్‌పూర్ సర్పంచ్‌స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో పోటీలో నిలిచాను. భర్త వ్యవసాయం, వ్యాపారం చేస్తుండడం, గ్రామస్తులతో మంచి పరిచయాలు ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నా. గ్రామస్థాయిలో ప్రజలు అనేక అన్యాయాలకు గురవుతున్నారు. ఆదర్శ గ్రామంగా చేయాలన్న కోరిక మేరకే పోటీలో నిలిచాను. – నునుగొండ మానస, బీటెక్ (ఈసీఈ)


