అప్పు చెల్లించాలని బైఠాయింపు
సిరిసిల్లటౌన్: అవసరం ఉందని వస్తే ఏడేళ్ల క్రితం రూ.5లక్షలు అప్పు ఇచ్చానని.. తిరిగి చెల్లించడం లేదంటూ సిరి సిల్లలో ఓ బాధితుడు నిరసన తెలిపా డు. బాధితుడు గణేశ్‌నగర్‌కు చెందిన యెనగంటి రాజయ్య తెలిపిన వివరాలు. ఏడేళ్ల క్రితం ఇల్లును విక్రయిస్తే వచ్చిన డబ్బుల్లో నుంచి రూ.5లక్షలు పట్ట ణానికి చెందిన వస్త్ర వ్యాపారికి ఇచ్చినట్లు తెలిపారు. ప్రతీ నెల వడ్డీ ఇస్తానని నమ్మించి మొండికేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా తీసుకున్న అ ప్పు డబ్బులు ఇవ్వడం లేదని, పైగా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా సదరు వ్య క్తి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. న్యాయం కోసమే తాము ఇలా బైఠాయించా మని వివరించారు. బాధితుడు ఠాణా మెట్టెక్కారు. అప్పు తీసుకున్న వ్యక్తి మాజీ ప్రజాప్రతినిధి తండ్రి కావడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయమైంది.


