సేవాలాల్‌తండా..
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని సేవాలాల్‌తండా పంచాయతీ పాలకవర్గానికి చివరి రోజు శుక్రవారం సర్పంచ్‌తోపాటు ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిగా భూక్య సరిత, వార్డు సభ్యులుగా లకావత్ శ్రీనివాస్, నిమ్మల అనిత, రమావత్ సునీత, ధరంసోత్ రేఖ, కట్ట వేణు, లకావత్ స్వరూప, రాగం దేవయ్య, ముడావత్ మౌనిక సింగిల్ నామినేషన్లు వేశారు. వీరిని సిద్దిపేట మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భూక్య చందర్‌నాయక్, నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, సురేందర్‌రావు, గౌతంరావు, కట్ట బాపురావు, కిషన్‌రావు అభినందించారు.


