సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జగిత్యాలరూరల్: జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ గ్రామాల్లో నిఘా పటిష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చర్యలు పడుతున్నారు. జిల్లాలోని 3,536 పోలింగ్ కేంద్రాల్లో 1/3వంతు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


