ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
మల్లాపూర్: గ్రామపంచాయతీ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్‌బాడీ) రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోలింగ్ అధికారుల శిక్షణ తరగతులను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లు శాంతియుత, స్వేచ్ఛాపూరిత వాతవరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రాణి, పంచాయతీ ఈవో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ మనోహర్‌రెడ్డి, ఆర్వో, ఏఆర్వో, పీవోలు, మండల పరిషత్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
గొల్లపల్లి: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గొల్లపల్లి, శ్రీరాములపల్లి, గుంజపడుగు, చిల్వకొడూరు కేంద్రాలను శుక్రవారం సందర్శించారు. భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. అదనపు ఎస్పీ వెంట గొల్లపల్లి ఎస్సై ఎం.కృష్ణసాగర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
జగిత్యాలటౌన్: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని జగిత్యాల అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో నిర్వహించిన పీఎంశ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ఆటల్లో ప్రావీణ్యం కనబర్చేలా చూడాలని సూచించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీల్లో సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాము, జిల్లా సెక్టోరియల్ అధికారి కొక్కు రాజేశ్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చక్రధర్, పెటా అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, పీఈటీలు పిడుగు భాస్కర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, అంజయ్యతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
భూసారాన్ని కాపాడితేనే పంటల్లో దిగుబడి
జగిత్యాలఅగ్రికల్చర్: భూసారాన్ని కాపాడితే పంటల్లో దిగుబడులు సాధ్యమని వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్. సంధ్య అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవంలో మాట్లాడారు. భూమిని సారవంతం చేసేందుకు సేంద్రియ, జీవన ఎరువులు వేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువులు వాడాలని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ భూతల్లిని సంరక్షిస్తేనే పంటలు పండే అవకాశం ఉందన్నారు. మృత్తిక శాస్త్రవేత్తలు పి.రవి, సాయినాథ్, వేణురెడ్డి, వ్యవసాయాధికారి ముక్తేశ్వర్, ఏఈవో సతీశ్, కోరమండల్ ప్రతినిధులు వినోద్, సురేశ్ పాల్గొన్నారు.
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి


