ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు
జగిత్యాల: పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జోనల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఫారం–14 అందించిన ప్రతిఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్‌సౌకర్యం కల్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులందరూ విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం ముందు అవరసమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతలో నాలుగు సర్పంచ్ స్థానాలు, 349 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికమయ్యాయని, 118 గ్రామపంచాయతీలు, 823 వార్డులకు ఈనెల 11న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజే ఉప సర్పంచ్ ప్రక్రియ ముగిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరణ్, నోడల్ అధికారులు రేవంత్, రవికుమార్ పాల్గొన్నారు.
ఒకరి ఓటు మరొకరు వేయకుండా చూడాలి
ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజున ఒకరి ఓటు మరొకరు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్‌వో, పీవో శిక్షణను సందర్శించి అరగంట సేపు కూర్చొని విన్నారు. పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు. వార్డు సభ్యులు గెలుపొందిన వారిని ఉప సర్పంచ్‌ను ఎన్నుకునే వరకు ఎటూ వెళ్లనియొద్దని అన్నారు. ఆర్‌డీవో శ్రీనివాస్, తహాసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో చిప్ప గణేశ్, ఎంఈవో మధు, ఆర్‌ఐ రెవంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


