అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.12.5 కోట్లు
జగిత్యాల: జగిత్యాలలోని అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.12.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇటీవల అర్బన్ హౌసింగ్ కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు కావడంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్క్‌లు, రహదారులు, డివైడర్లు ఏర్పాటు చేయడ ం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జగిత్యాలకు అత్యధికంగా నిధులు మంజూరు చేయడం అ భినందనీయమని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నా యకులు గిరి నాగభూషణం, జ్యోతి పాల్గొన్నారు.
కేంద్ర నిధులతోనే గ్రామాలాభివృద్ధి
రాయికల్: కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. శుక్రవారం రాయికల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర నిధులతో పాటు గ్రామాల అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారంతో మరిన్ని నిధులకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, పట్టణ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ మధు, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, నాయకులు భూమేశ్, సంజీవ్, మహేశ్, శ్రీని వాస్, నర్సయ్య, సత్తయ్య, మచ్చ నారాయణ, సామల్ల సతీశ్, శ్రీకాంత్‌రెడ్డి, సుమన్ పాల్గొన్నారు.
అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.12.5 కోట్లు


