గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంవర్థక రంగం కీలకం
కోరుట్ల రూరల్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంవర్థక రంగం కీలక భాగమని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణ శివారులోని పీవీ సరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. పశు వైద్యసేవలు, ల్యాబ్ సదుపాయాలు, చికిత్సా విధానం, ఆధునిక పరికరాల వినియోగాన్ని పరిశీలించారు. ప్రాక్టికల్స్, ఫీల్డ్ అనుభవం, , భవిష్యత్ లక్ష్యాలను పశువైద్య విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు, పశు పోషకులకు ఉపయోగపడేలా వెటర్నరీ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన
కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులతో అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆసుపత్రి వైద్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


