పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన
● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ
● సాంకేతికపరమైన అంశాలపై అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా
● ప్రాజెక్టు, పంపుహౌజ్, రైల్వేస్టేషన్, గోదావరితీరం సందర్శన
ఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివిటీ చేసే అంతార్గం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గురువారం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం క్షేత్ర పరిశీలన చేపట్టింది. ఎయిర్‌పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ.. వివిధ అంశాలపై అధికారులను ఆరాతీస్తూ ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో ఎవియేషన్ బృందం పర్యటన కొనసాగింది. పాలకుర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం ఏర్పాటుకు పలుసాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని తలంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రీఫిజిబిలిటీ సర్వే కోసం రూ.50 లక్షలు నిధులు విడుదల చేసింది. దీంతో విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారుల బృందం రాగా.. వారికి వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల బృందం సాంకేతికపరమైన అంశాలను నివేదించేలా ప్రతిపాదనలు అందించారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ స్థలం, గోలివాడ గోదావరినది తీరం, పెద్దంపేట రైల్వేస్టేషన్, గోలివాడ పంపుహౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేసింది. – సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లో..
పరిశీలించి.. ఆరా తీసి


