వైభవంగా దత్తజయంతి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని శ్రీమార్కండేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్‌శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోగ గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, భోగ రాజు, భక్తులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
సారంగాపూర్: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. బీర్‌పూర్ మండలం తుంగూరు, కొల్వాయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్ బి.సుజాత, సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారు.
అరటితో అధిక ఆదాయం
జగిత్యాలఅగ్రికల్చర్: వరితో పోలిస్తే అరటితో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో రైతులు సాగుచేసిన అరటి తోటలను గురువారం ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. అరటి మొక్కలు నాటేందుకు శీతాకాలం అనువైన సమయమన్నారు. నాటిన 9 నెలల తర్వాత దిగుబడి ప్రారంభమై.. రెండేళ్ల వరకు కొనసాగుతుందన్నారు. టిష్యూ కల్చర్ మొక్కలతో అరటిలో అధిక దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి కె.స్వాతి, హెచ్‌ఈవో అన్వేష్, రైతులు పాల్గొన్నారు.
మొబైల్ ఎక్స్‌రేతో క్షయ నివారణ సులభం
● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్
జగిత్యాల: మొబైల్ ఎక్స్‌రేతో క్షయనివారణ మరింత సులభతరం అవుతుందని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. జిల్లాకు చేరిన మొబైల్ ఎక్స్‌రేను గురువారం ప్రారంభించారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో ఈ మిషన్ల ద్వారా ఎక్స్‌రే తీసి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించవచ్చన్నారు. వైద్యులు శ్రీనివాస్, ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
● డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి
జగిత్యాల: లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం వసతులు, వెంటిలేషన్ సౌకర్యం, వెయిటింగ్‌హాల్ ఉండాలన్నారు. స్కానింగ్ మిషన్స్, డాక్టర్ అర్హత, ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని తెలిపారు. ఆయన వెంట కట్కం భూమేశ్వర్, పడాల శంకర్ ఉన్నారు.
వైభవంగా దత్తజయంతి
వైభవంగా దత్తజయంతి
వైభవంగా దత్తజయంతి
వైభవంగా దత్తజయంతి


