ప్రజాభద్రతలో హోంగార్డుల సేవలు అమూల్యం
జగిత్యాలక్రైం: ప్రజాభద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ విభాగాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు హోంగార్డ్ రైజింగ్ డే వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అన్నారు. హోంగార్డు సిబ్బంది డ్యూటీని బాధ్యతగా నిర్వహించే క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్‌శాఖకు గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ సీఐలు కిరణ్‌కుమార్, సైదులు, వేణు, రిజర్వ్ ఎస్సైలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్


